మేము బైబిల్‌ను పూర్తిగా ఇష్టపడతాము, కానీ అనేక అధ్యాయాలలో నుండి ఎంపిక చేసిన వచనలాలు మీకు స్ఫూర్తినిస్తాయి. ‘దేవుని మాట‘ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారమైయున్నది కాబట్టి ఆ వాక్యాలు మీకు శాంతి, ఆనందం మరియు దేవునిప్రేమను కావలసినంతగా కుమ్మరిస్తాయి. ‘సమయోచితమైన మాట యెంత మనోహరము!‘ అని సామెతలు 15:23 లో చెప్పబడింది. అదే దేవుని మాట అయితే?! యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును కీర్తనలు 29:9. దేవుని మాట నిరాకారముగాను శూన్యముగాను వున్న దానిలో మన కళ్ళకు కనిపిస్తున్న సమస్త సృష్టిని సృష్టించింది. అందుకే యేసుక్రీస్తు మత్తయి 4:4లో ఇలా అన్నాడు “–మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును“.
మీకు ఇష్టమైన వచనాల కోసం మంచి చిత్రం కోసం చూస్తున్నారా? మీరు వెతుకుతున్న దాన్ని సులభంగా కనుగొనడానికి మేము వాక్యాలతో కూడిన చిత్రాలను కొన్నింటిని ఇస్తున్నాము. దేవుని వాక్యం నుండి ప్రేరణతో ఇతరులను ఆశీర్వదించడానికి మరియు ఉత్సాహపరిచేందుకు మీ సోషల్ నెట్‌వర్క్ పేజీలలో ఈ సుందరమైన చిత్రాలను పోస్ట్ చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి ఏ మాత్రం సంకోచించనవసరం లేదు.
ఊహాత్మక కళాత్మకంగా రూపింపబడిన చిత్రం విస్తృతంగా వాడబగుతున్న మీడియా దేవుని వాక్యాలతో నిండిన చిత్తాలు శక్తివంతమైన మరియు భర్తీ చేయలేని గొప్ప సాధనం. అసాధారణంగా ఉపయోగపడే ఈ "చిత్రాలపై ఉన్న వచనాలు" ఖచ్చితంగా భగవంతుడిని, ఆయన దివ్యవాక్కులను సులభంగా మనం తెలుసుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది.