నిరాశ, నిస్ఫృహ, దుఃఖ బాధలలో సమయానికి దేవుని వాక్యంతో నిండిన బైబిల్ ఆదరించి ధైర్యపరిచి జీవితంలో ముందుకు నడిపించిన విధంగా ఏది చేయదేమో! అలాగే బైబిల్ ను ఆధారం చేసుకు ప్రచురించే పుస్తకాలు (భక్తుల జీవితాలకు సంబంధించిన ప్రచురణలు, ఆధ్యాత్మిక వర్తమానాలతో కూడిన పుస్తకాలు, పత్రికలు మొదలగునవి) అనుదిన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ దైవ సందేశాలతో కూడిన పుస్తకాలు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని, అన్నివేళల ఆయన మనతోనే ఉన్నాడని ఈ పుస్తకాలు గుర్తుచేసి మనం నిలబడి బలంతో ముందు నడచుటకు కావలసిన శక్తని ఒనగూర్చుతాయి.
బైబిల్ వచనాలతో నిండిన ఈ పుస్తకాలు జీవితంపై మీ దృక్కోణాన్ని మార్చగలవు. మీరు మీ సంబంధాలు మరియు స్నేహాల గురించి కొంత మార్గదర్శకత్వం కోసం వెతుకుతుండవచ్చు లేదా పిల్లల పెంపకం కష్టతరమైనప్పుడు మిమ్మల్ని కొనసాగించడానికి మీరు పదాల కోసం వెతుకుతూ ఉండవచ్చు. లేదా మీ ప్రార్థనలకు జవాబులు మరియు మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఇలా అనేక విషయాలను గూర్తి వెతుకుతుండవచ్చు. మీరు దేని కోసం వెతుకుతున్నా, ఈ శక్తివంతమైన బైబిల్ వచనాలు నిండిన ఈ పుస్తకాలు మిమ్ములను బలపరచి మార్గనిర్దేశం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.
బైబిల్ చెపుతుంది ‘ యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం‘ చేయమని చెపుతుంది. మరోక చోట ఈ విధంగా చెపుతుంది-ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి (ఫిలి 4:8). బైబిల్ బోధలతో నిండిన పుస్తకాలు మనలను బలపరిచి మన ప్రభువుతో నడచుటకు ప్రాత్సహిస్తాయి. ఈ వివరణలతో కూడిన ఈ పుస్తకాలు దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి సహాయపడతాయి.
సమాచారం నుండి మరమ్మతు వరకు మనకు రోజువారీ జీవనానికి అవసరమైన సమాచారం బయట పుస్తకాలలో దొరికినట్ల ఆధ్యాత్మిక విలువలతో కూడిన పుస్తకాలు ఆత్మీయ జీవితంలో అంతే విధంగా సహాయం చేస్తాయి. ఉన్నత ప్రమాణాలతో దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి నిజమైన ఆసక్తి ఉన్న వారితో మేము పని చేస్తాము. వారి ప్రచురణలను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన టెక్నికల్ సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాము.